సమంత కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన సినిమా ‘ఏ మాయ చేసావే’. సుమారు 15 ఏళ్ల క్రితం విడుదలై ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఈ సినిమా, వచ్చే నెల జులై 18న తిరిగి థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా, సామ్-చైతు ఈ రీ రిలీజ్ ప్రమోషన్లలో కలిసి పాల్గొంటారని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై సమంత తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..…