Delhi murder case: దేశ రాజధానిలో సంచలన ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలోని దాబ్రీ ప్రాంతంలో ఒక యువతి మృతదేహం గోనె సంచిలో కనిపించడంతో ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించడం మొదలు పెట్టారు. ఈక్రమంలో నిందితుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సలీంగా గుర్తించి అరెస్టు చేశారు. READ…