వచ్చే నెల ( అక్టోబర్ ) 5వ తారీఖు నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా పలు కీలక మ్యాచ్‌లకు ఇది వరకే టికెట్ల అమ్మకం పూర్తైంది. తాజాగా ఐసీసీ, బీసీసీఐలు సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకూ టికెట్లను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. నేటి రాత్రి నుంచి వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు టికెట్ల బుకింగ్ ఓపెన్ కానుంది.