2008లో జరిగిన ఢిల్లీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఐదుగురు నిందితులను ఢిల్లీ కోర్టు బుధవారం దోషులుగా నిర్ధారించింది. హెడ్‌లైన్స్ టుడే న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా పనిచేసిన విశ్వనాథన్, సెప్టెంబర్ 2008లో ఆఫీసు నుండి ఇంటికి వెళ్తుండగా ఆమె కారులోనే కాల్చి చంపబడ్డారు.
Firing at Delhi's Saket court: ఢిల్లీ సాకేత్ కోర్టు ప్రాంగణంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మొత్తం 4 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటన జరగగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన మహిళను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.