Hyderabad: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి 'ఆపరేషన్ కవచ్' పేరుతో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా నాకాబందీని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బందితో పాటు అయన పాల్గొంటున్నారు.