హీరోగా స్టార్‌డమ్ అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. సినిమా కుటుంబం నుంచి వచ్చినా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి టాలెంట్, కష్టపడి పనిచేయడం, అలాగే కొంత అదృష్టం కూడా అవసరం. ఈ విషయాన్ని తన కెరీర్ అనుభవాలతో తాజాగా వెల్లడించారు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. ప్రజంట్ స్టార్ హీరో హోదాలో ఉన్నప్పటికీ ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడ్డాడట. తన తల్లి శర్మిలా టాగోర్ బిగ్ స్టార్, తండ్రి క్రికెట్ లెజెండ్ మన్‌సూర్ అలీ…