కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కి చేరుకుని బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో 12 ఏళ్ల సహస్ర హత్య కేసు ఛేదనలో పోలీసులు కీలక ఆధారాలను వెలికి తీశారు. హత్య నిందితుడు, 10వ తరగతి విద్యార్థి తన దొంగతనం ప్లాన్‌ను “మిషన్ డాన్” పేరుతో రాసుకోవడం విచారణలో బయటపడింది.