బాలీవుడ్ హీరో సచిన్ జోషి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. ఆయన బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులోనూ పలు సినిమాలు చేశాడు. అయితే 2021 నుంచి జైలులో ఉన్న సచిన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆ వివరాల్లోకి వెళ్తే… మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 (PMLA) కింద మొత్తం రూ. 410 కోట్ల బ్యాంకు నిధులను స్వాహా చేయడం / మళ్లించడం వంటి ఆరోపణలపై 2021 ఫిబ్రవరి 14న జోషిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు…