బాలీవుడ్ హీరో సచిన్ జోషి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. ఆయన బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులోనూ పలు సినిమాలు చేశాడు. అయితే 2021 నుంచి జైలులో ఉన్న సచిన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆ వివరాల్లోకి వెళ్తే… మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 (PMLA) కింద మొత్తం రూ. 410 కోట్ల బ్యాంకు నిధులను స్వాహా చేయడం / మళ్లించడం వంటి ఆరోపణలపై 2021 ఫిబ్రవరి 14న జోషిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు మంజూరు చేసిన మెడికల్ బెయిల్‌పై బయట ఉన్నారు.
తాజాగా ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రత్యేక PMLA కోర్టు వ్యాపారవేత్త, నటుడు, నిర్మాత సచిన్ జోషికి సోమవారం (మార్చి 7) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 30 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తంలో ఇద్దరి పూచీకత్తుపై ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండే రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును ఆమోదించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు భారత్ విడిచి వెళ్లరాదని, అలాగే పాస్‌పోర్టును ఈడీకి సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణకు విఘాతం కలిగించే లేదా “నేరపు రాబడి”కి సంబంధించిన ఏదైనా చర్యలో పాల్గొనవద్దని జోషిని కోర్టు ఆదేశించింది.
Read Also : Poonam Kaur : యూట్యూబర్లకు వార్నింగ్… చర్యలు తప్పవు !
ఈడీ… ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కవితా పాటిల్ ద్వారా బెయిల్ ఆర్డర్ ఆమోదించిన తర్వాత, తీర్పును సవాలు చేయడానికి, బెయిల్ ఆర్డర్ అమలుపై స్టే విధించడానికి మూడు వారాల గడువును అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. సీనియర్ న్యాయవాది అబాద్ పొండా, న్యాయవాది సుభాష్ జాదవ్ ద్వారా జోషి బెయిల్ కోసం అభ్యర్థించారు. దర్యాప్తు సంస్థ తనతో ముడిపడి ఉన్న “నేర ప్రక్రియలను” నిర్ధారించడంలో విఫలమైందనివిఫలమైందని పేర్కొన్నారు.,
మార్చి 2020లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని సిటీ చౌక్ పోలీస్ స్టేషన్ లో దాఖలైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎం/ఎస్ ఓంకార్ గ్రూప్ ప్రమోటర్లపై ED దర్యాప్తు ప్రారంభించింది. ఈ విచారణ సమయంలో కీలక వ్యక్తుల నివాస, కార్యాలయాలతో సహా వివిధ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. ఆ తరువాత ED 2021 జనవరి 27న M/s ఓంకార్ గ్రూప్ ప్రమోటర్లు బాబూలాల్ వర్మ, కమల్ కిషోర్ గుప్తాలను PMLA, 2002 కింద అరెస్టు చేసింది. అందులో జోషి ప్రమేయం ఉన్నట్లు ఈడీ కనుగొంది. దాదాపు రూ.87 కోట్లను దారి మళ్లించినట్టు గుర్తించారు. దీంతో జోషిని పిలిపించి విచారించారు.