ఛేదనలో ఆరంభంలోనే కీలక వికెట్స్ కోల్పోయిన సమయంలో తాను, సచిన్ దాస్ పదే పదే మాట్లాడుకున్నామని భారత అండర్ 19 కెప్టెన్ ఉదయ్ సహరన్ తెలిపాడు. తాను క్రీజ్‌లో ఉంటానని, నువ్వూ కూడా ఉండు అని సచిన్ దాస్‌తో చెప్పానని ఉదయ్ చెప్పాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా.. మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లాలని తాను మనసులోనే అనుకున్నానని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాపై 245 పరుగుల ఛేదనలో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో ఉదయ్ (81; 124…