ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు అమ్మ రాజశేఖర్ మరోసారి వెండితెరపైకి ఆర్టిస్ట్ గా వస్తున్నాడు. అతనితో పాటు కట్ల ఇమ్మార్టెల్, అలీషా, షాలినీ ప్రధాన తారాగణంగా ‘ఎస్.ఎస్.డి’ (స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్) అనే సినిమా గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఈ చిత్రాన్ని కట్ల రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఈడీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి రాజశేఖర్, జీవిత, యస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, రామ సత్యనారాయణ, సాయివెంకట్, పారిశ్రామికవేత్త ప్రశాంత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.…