ఏపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. అన్నదాతల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈనెల 23న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని ఆయన తెలిపారు. రైతుల కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు త్వరలో గుంటూరు జిల్లాలో కూడా పవన్…