ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన చిత్రం ‘ది గ్రే మ్యాన్’. ఈ నెల 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ఇండియన్ యాక్టర్ ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. గ్లోబల్ స్టార్‌కాస్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇదొక యాక్షన్ బ్లాక్‌బస్టర్ అనే నమ్మకాన్ని కలిగించాయి. ఈ సినిమా గురించి రూసో బ్రదర్స్ మాట్లాడుతూ…