ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ వ్యూహం మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రెండో దఫా చర్చల్లో పౌరులు సురక్షితంగా తరలివెళ్లడానికి రష్యా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే, తొమ్మిదో రోజు దాడుల్లో ఆ హామీకి కట్టుబడుతూనే.. ఉక్రెయిన్‌లోని భారీ పవర్ ప్లాంట్‌లను రష్యా టార్గెట్ చేసింది. యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియాలో ఉంది. దానిపై రష్యా వరుస దాడులకు పాల్పడింది. జపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా బాంబు దాడి చేయడంపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ-…