Rub al Khali Desert: తెలంగాణకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి సౌదీ అరేబియాలో అత్యంత దారుణ పరిస్థితుల్లో మరణించాడు. రబ్ అల్ ఖలీ ఎడాదిలో దిక్కుతోచని స్థితిలో జనావాసాలకు వెళ్లే మార్గం లేకపోవడంతో అధిక అలసట, డీహైడ్రేషన్‌తో విషాదకరమైన స్థితిలో మరణించాడు. సౌదీలోని అల్ హసా ప్రాంతంలో టెలికాం కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్న మహ్మద్ షెహజాద్ ఇటీవల తన సహచరుడితో కలిసి ఎడారి ప్రాంతానికి వెళ్లాడు.