సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో అన్ని సమస్యల పరిష్కారాలపై చర్చించినట్లు తెలిపింది. మంత్రి హామీతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, మంత్రి హామీతో సమ్మె తాత్కాలికంగా విరమించుకున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్ లో సమ్మె తప్పదని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడి దశల వారీగా పరిష్కారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
సోనియాగాంధీ రాహుల్ గాంధీ ఖర్గే అగ్రనేతలందరూ మాట ఇచినట్టే కుల గణన చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నారో నిష్పత్తి ప్రకారం వివరాలు నమోదు చేస్తున్నామని, నవంబర్ 31 లోగా కులగణన ను రేవంత్ రెడ్డి చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. కులగణన దామాషా ప్రకారమే రాజకీయ పదవులు కూడా అందుబాటులో ఉంటాయని, కేటీఆర్ హరీష్ రావు ప్రతి అంశం పట్ల రాజకీయం చేస్తున్నారన్నారు. రాజకీయ…