ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.99 నాణ్యమైన లిక్కర్ అమ్మకాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.. మార్కెట్‌లోకి చీప్ లిక్కర్ అందుబాటులోకి వచ్చింది.. దీంతో.. మందుబాబుల్లో హుషారు మరింత పెరిగిపోయింది.. షార్ట్స్ పేరుతో బ్రాండీ, విస్కీ అమ్మకాలు ప్రారంభం అయ్యాయి.. అయితే, పూర్తిస్థాయిలో మద్యం అందుబాటులోకి వచ్చేవరకు లిమిటెడ్ స్థాయిలో అమ్మకాలు జరగనున్నాయి.. ఇప్పుడు మాత్రం.. ఒక్కో లిక్కర్ షాపుకు మూడు నుంచి 8 కేసులు మాత్రమే సరఫరా చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త లిక్కర్ షాపులు ప్రారంభం అయినా.. మద్యం దుకాణాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు 99 రూపాయల క్వార్టర్ బాటిల్.. ఏపీ ప్రభుత్వం క్వార్టర్ రూ.99కి అందిస్తామని చెప్పిన నేపథ్యంలో డిపోలకు చేరాయి షాట్ విస్కీ, ఓల్డ్ క్లబ్ బ్రాందీ.. కానీ, డిపోల నుంచి ఇంకా అత్యధిక షాపులకు రూ.99 క్వార్టర్ బాటిల్స్ చేరలేదు.. కొన్నింటికి మాత్రమే రూ.99 క్వార్టర్ బాటిల్స్ చేరాయి..