భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న అజిత్ అగర్కర్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. అజిత్ అగర్కర్ సేవలపై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ భారత పేసర్ ఆర్‌పీ సింగ్ తదుపరి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఓ స్పోర్ట్స్ ఛానెల్ తమ కథనంలో పేర్కొంది. అజిత్ అగర్కర్ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీ…