అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ వెలుగులు వెలిగాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మొదటిసారి విద్యుత్ కనెక్షన్ వచ్చింది. 17 కుటుంబాలు నివసించే గూడెంకి 9.6 కి.మీ పొడవున 217 విద్యుత్ స్తంభాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వం తరఫున 5 బల్బులు, ఒక ఫ్యాన్ అందించారు. సుమారు రూ.80 లక్షల వ్యయంతో పర్వత అడవి ప్రాంతంలో…