కోనసీమ జిల్లా రాజోలు వైసీపీలో మళ్ళీ రచ్చ మొదలైంది. రాజోలు వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బొంతు రాజేశ్వరరావు ప్రస్తుతం వైసీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అనుచరులతో జరిగిన సమావేశంలో బొంతు రాజేశ్వరరావు మాటలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. రెండు రోజుల క్రితమే బొంతు రాజేశ్వరరావు ఇంటికెళ్లి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీ ప్లీనరీ సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఇప్పటికే పార్టీ…