భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ 50 ఓవర్ల వన్డే ప్రపంచ కప్ నిజమైన ప్రపంచ కప్ అని, టీ20 ప్రపంచ కప్ కు అదే హోదా ఉండకూడదని అన్నారు. టీ20 ప్రపంచ కప్ పేరు మార్చాలని కూడా మంజ్రేకర్ సూచించారు. దీనిని వరల్డ్ టీ20 అని పిలవాలని ఆయన సూచించారు. టెస్ట్ క్రికెట్, టీ20 క్రికెట్ మధ్య ఇరుక్కుపోయి వన్డే క్రికెట్ నెమ్మదిగా తన ప్రాముఖ్యతను కోల్పోతున్న సమయంలో మంజ్రేకర్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.…