Rohit Sharma Robo Walk Video: దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసిన భారత్.. టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది. ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవకాశాలు ఉన్న స్థితిలో అద్భుతమే చేసి విశ్వవిజేతగా నిలిచింది. ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న రోహిత్ సేన.. దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన ఫైనల్ పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి.. 13 ఏళ్ల ప్రపంచకప్, 11 ఏళ్ల ఐసీసీ…