రోహన్ బోపన్న తన కెరీర్‌లో 35 ఏళ్ల తర్వాత భారీ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బోపన్న వయసు 44 ఏళ్లు. అయినప్పటికీ.. అతను విజయాల్లో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం బోపన్న.. మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని గ్రాండ్‌స్లామ్ గెలిచిన ఎక్కువ వయస్సున్న టెన్నిస్ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు బోపన్న కళ్లు పారిస్ ఒలింపిక్స్‌పై పడ్డాయి. అయితే.. తాను తన రెగ్యులర్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌తో కాకుండా ఎన్. శ్రీరామ్ బాలాజీతో రంగంలోకి దిగబోతున్నాడు.