భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన ఛైర్మన్‌గా ఎస్.సోమనాథ్ నియామకం అయ్యారు. 2018 నుంచి విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా సోమనాథ్ విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 14తో ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ కె.శివన్ పదవీ కాలం ముగియనుంది. అనంతరం సోమనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేరళకు చెందిన సోమనాథ్ దేశంలో టాప్ రాకెట్ సైంటిస్టుల్లో ఒకరిగా ఉన్నారు. ఉపగ్రహ వాహక నౌకల డిజైనింగ్‌లో సోమనాథ్ కీలక పాత్ర పోషించారు. కెరీర్ తొలినాళ్లలో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్…