రానున్న రెండేళ్ళ కాలంలో కాకినాడ శివారు ప్రాంతాలకు తాగునీటి సమస్యను తీరుస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన కాకినాడలో మాట్లాడుతూ.. త్వరలో జరిగే కొన్ని మున్సిపల్ ఎన్నికలకు గ్రామాల విలీన సమస్యలు ఉన్నాయని అన్నారు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారని, వాటికి వేకెట్ చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. రోడ్లు అనేవి ఒక నిరంతర ప్రక్రియ. ఒక కొత్త రోడ్డుకు ఐదేళ్ళ నుండి ఏడేళ్ళ వరకు కాల పరిమితి…