నేడు నాలుగు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ రోడ్‌షో లు నిర్వహించబోతున్నారు. మునుగోడు, కోదాడ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు.
KTR Road Show: తెలంగాణ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో అధికార బీఆర్‌ఎస్ ఇప్పుడు తదుపరి ప్రచార దశపై దృష్టి సారించింది. ఈసారి గ్రేటర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగనున్నారు.
మంత్రి కేటీఆర్ వికారాబాద్ జిల్లాలో రోడ్ షో వివరాలు ఇవే.. ఉదయం 11 గంటలకు చేవెళ్ల నియోజక వర్గంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సపోర్టుగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వికారాబాద్ టౌన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోసం కేటీఆర్ రోడ్ షో చేస్తున్నారు.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు మర్పల్లి మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో చేయనున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం జోరుమీదుంది. ప్రచారంలో నాయకులు ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సంధింస్తున్నారు. అయితే.. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇవాళ రానున్నారు.