నిర్లక్ష్యం, అజాగ్రత్త, ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు పలువురు వాహనదారులు. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటుండగా.. చాలా మంది తీవ్ర గాయాలపాలై వైకల్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో రోడ్డు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జరిగే చాలా రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రవర్తన, భద్రతా నియమాలను పట్టించుకోకపోవడం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. ప్రశ్నోత్తరాల…
బీర్లకు, బార్లలో ఖర్చు చేస్తున్నారు.. కానీ ప్రాణానికి రక్షణనిచ్చే హెల్మెట్ కోసం మాత్రం ఖర్చు చేయడం లేదని వాపోయారు. జిల్లాలో గత ఏడాదిలో 213 మంది చనిపోయారు.. మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్లు ఉంటారు.. అందుకే రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు పాటించాలని మంత్రి సీతక్క తెలిపారు.