కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. అనంతరం న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరిగాయి. పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే ఈ ఘటన తర్వాత నిందితుడు సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేసినా.. అన్ని వేళ్లు మాత్రం ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వైపే చూపించాయి.
ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొదటి నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు సందీప్ ఘోష్‌ని సీబీఐ విచారించింది. తాజాగా ఈ రోజు అతడిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ అతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు
డాక్టర్ ఘోష్ తన చర్యల ద్వారా వృత్తికి చెడ్డపేరు తెచ్చారని మరియు క్రమశిక్షణా కమిటీ అతన్ని జాతీయ వైద్య సంఘం సభ్యత్వం నుండి "వెంటనే" సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని ఐఎంఏ ప్రకటనలో పేర్కొంది. ఇదే కాకుండా హత్యాచార పరిస్థితిని ఎదుర్కొనే విషయంలో మీరు బాధితురాలి తల్లిదండ్రులకు మనోవేదనను పెంచారు, అలాగే సమస్యనున సముచితంగా నిర్వహించడంలో సానుభూతి, సున్నితత్వం లేదని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాసి లేఖ తాజాగా వైరల్ అవుతోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మమత లేఖ రాసింది. కోల్‌కతా ఘటన తర్వాత ఈ లేఖ వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన ఓ వైపు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంకోవైపు బుధవారం అర్ధరాత్రి వందలాది మంది అల్లరి మూకలు ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోకి ప్రవేశించి సాక్ష్యాలను చెరిపివేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
Kolkata RG Kar Medical College Vandalised : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్పత్రి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం బాధ్యతలేనట్టుగా కనిపిస్తున్నాయి. వైద్యురాలు అత్యంత దారుణంగా.. అత్యాచారానికి గురై, హత్య చేయబడి అర్ధనగ్నంగా శవమై పడి ఉంటే ఆర్‌జీ కర్ హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌కు మాత్రం విచిత్రంగా అర్ధమైంది.