Bhu Bharathi Bill: భూభారతి బిల్లును తెలంగాణ అసెంబ్లీ సభలో ప్రవేశ పెట్టారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత, భరోసా అని ఈ సందర్బంగా తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించి ఈ చట్టాన్ని తీసుకొచ్చామని, లక్షలాది మంది ధరణితో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ధరణిని అర్థరాత్రి ప్రమోట్ చేశారని, నాలుగు నెలలు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. 2 నెలలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు…