Off The Record: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గడిచిన…వరుసగా మీడియా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో రోజు.. ఒక్కో సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములపై ఆయన ప్రశ్నిస్తున్నారు. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారధికి కేటాయించిన భూముల వ్యవహారంలో ఐదు వేల కోట్ల ప్రజాధనం ప్రభుత్వానికి రాకుండా పోయిందని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన జీవోనే… తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తూ…భూములు కేటాయిస్తున్నారని విమర్శించారు. దీనికి కొనసాగింపుగా హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో యశోద ఆసుపత్రి యాజమాన్యానికి కేటాయించిన భూముల…