తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు లేనట్లేనా? ముఖ్యమంత్రి హామీ పై ఉన్నతాధికారులు కసరత్తు చేయలేదా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన వరం కార్పొరేషన్ ఉద్యోగులకు వర్తించదా? ఆర్టీసీ ఎంప్లాయిస్ రిటైర్మెంట్ ఏజ్ పై ఉద్యోగులు ఏమంటున్నారు?. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అంశం మరోసారి చర్చకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కార్పొరేషన్ల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. అప్పట్లోనే ఆర్టీసీ కూడా తన ఉద్యోగులకు దాన్ని వర్తింప…