గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. ఐటీ, ఫార్మా కంపెనీలకు హబ్‌గా ఉండటంతో పాటు ఓఆర్ఆర్, మెట్రో విస్తరణ, భారీ రింగ్ రోడ్, ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు బలమైన పునాదులు వేస్తున్నాయి. ప్రభుత్వం నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుండడంతో స్థిరాస్తి వ్యాపారానికి అనుకూలంగా మారింది. శివార్లలో అత్యాధునిక వసతులతో కూడిన గేటెడ్…