Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా మళ్లీ ఇక్కడకు ఎందుకు వచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.