(మార్చి 20న శోభన్ బాబు వర్ధంతి)సినిమా రంగాన్ని నమ్ముకుంటే ఎవరినైనా చిత్రసీమ తల్లిలా ఆదరిస్తుందని ఎందరో చెబుతూ ఉంటారు. చిత్రసీమలోనే నటునిగా నిలదొక్కుకోవడానికి నటభూషణ శోభన్ బాబు దాదాపు పుష్కరకాలం శ్రమించారు. 1959లో యన్టీఆర్ ‘దైవబలం’లో ఓ చిన్న పాత్ర ద్వారా తెరపై తొలిసారి కనిపించిన శోభన్ బాబు, తారాపథం చేరుకోవడానికి దాదాపు 12 ఏళ్ళు కష్టపడ్డారు. ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ సక్సెస్ తో శోభన్ బాబు కూడా స్టార్ హీరో అయిపోయారు. అంతకు ముందు ఆయన…