హైందవం ఒక మతం కాదు. అది జీవనశైలి. సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక. సనాతనం అంటే అతి పురాతనం కానీ, నిత్యనవీనం. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు. ప్రపంచ మతాలు అన్నిటిలో హిందూ మతమే అతి పురాతనమైనది. నేడు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. అమెరికా, రష్యా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాల పౌరులు ఆధ్యాత్మిక శాంతి, సమతుల్య జీవితం కోసం దీనిని అవలంబిస్తున్నారు.