నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి భారీ ఊరట లభించింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో ఈడీ ఛార్జిషీటును న్యాయస్థానం కొట్టేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటు కొనసాగించదగినది కాదని పేర్కొంది. ఈ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా కాకుండా ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరిగిందని అభిప్రాయపడింది.…