‘విమానం’ సినిమా ఈమధ్య కాలంలో మంచి బజ్ ని జనరేట్ చేస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విమానం ఎక్కాలని ఎంతో ఆశ ఉన్న ఒక చిన్న కుర్రాడు, తన కోరికను తండ్రికి చెబితే బాగా చదువుకుంటే విమానం ఎక్కవచ్చునని చెబుతాడు. అంగ వైకల్యంతో బాధపడే తండ్రి వీరయ్య ఎలాంటి కష్టం తెలియకుండా తల్లి లేని కొడుకుని పెంచుకుంటుంటాడు. మరి ఆ పిల్లాడి కోరిక తీరిందా?…