Today (14-01-23) Business Headlines: ఫారెక్స్ తగ్గింది.. పసిడి పెరిగింది: ఇండియాలోని విదేశీ మారక నిల్వలు మరోసారి తగ్గాయి. తాజాగా 126 కోట్ల డాలర్లకు పైగా క్షీణించాయి. ఫలితంగా 56 వేల 158 కోట్ల డాలర్లకు చేరాయి. రూపాయి విలువను రక్షించేందకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెక్స్ రిజర్వులను వెచ్చిస్తుండటంతో అవి నేల చూపులు చూస్తున్నాయి. ఇది ఈ నెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉన్న సమాచారం.
Today (20-12-22) Business Headlines: ‘ఏపీ బ్యాంక్’కి జరిమానా: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26 లక్షల రూపాయలకు పైగా జరిమానా విధించింది. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంకు.. రూల్స్ పాటించకపోవటంతో ఆర్‌బీఐ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. మరో 19 కోపరేటివ్ బ్యాంకుల పట్ల కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇందులో 17 బ్యాంకులు ఒక్క గుజరాత్‌కే చెందినవి కావటం గమనించాల్సిన విషయం.