టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన టాలెంటెడ్ నటి రెజీనా కసాండ్రా. 2005లో తమిళ చిత్రం ‘కండనాల్ మొదల్’తో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన రెజీనా, తెలుగులో ‘SMS (శివ మనసులో శృతి)’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో, ఆమె టాలీవుడ్‌లో అనతి కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ, కొంతకాలం తర్వాత విజయాల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ, ఆమె కెరీర్‌ను కొనసాగిస్తూ.. ప్రజంట్ మిడిల్‌రేంజ్ చిత్రాలలో అవకాశాలను దక్కించుకుంటూ, తన కెరీర్‌ను…