Upcoming Smart Phones: మరో 30 రోజుల్లో 2024 సంవత్సరం ముగియబోతోంది. ఇకపోతే, ఈ సంవత్సరం ముగిసేలోపు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు తమ జనాదరణ పొందిన అనేక ఉత్పత్తులను పరిచయం చేయడానికి రెడీ ఐపోయాయి. డిసెంబర్ నెలలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు బడా బ్రాండ్స్ నుండి విడుదల కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో పెను సంచలనాలను సృష్టించగలవని కంపెనీలు భావిస్తున్నాయి. ఎందుకంటే, శక్తివంతమైన ఫీచర్లు ఇంకా ఆకర్షణీయమైన ధరల అద్భుతమైన కలయికతో రాబోతున్నాయి. మరి ఆ మొబైల్స్ ఏంటో…
‘షావోమీ’ ఫోన్లలో రెడ్‌మీ నోట్ సిరీస్‌కు సెపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంది. ఇప్పటి వరకు రెడ్‌మీ నోట్ సిరీస్‌లో రిలీజైన వాటిలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు టెక్ ప్రియులను అలరించాయి. ఇందుకు కారణం బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లు ఉండడమే. ఇప్పుడు ఈ నోట్ సిరీస్‌లో తదుపరి ఫోన్‌లు భారత మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన ‘రెడ్‌మీ నోట్ 14’ సిరీస్ వచ్చే నెలలో భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. రెడ్‌మీ నోట్ 14 సిరీస్ సెప్టెంబర్‌లో చైనాలో…