ఏపీలో జిల్లా పునర్విభజనపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది తరువాత కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజనపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుస్థిర ఆర్థిక ప్రగతికోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులకు ఆదేశించారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాలకోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలన్నారు. దీనితోపాటు కనీసంగా 15 ఎకరాల…