భారతదేశంలో నేరాలు చేసి విదేశాలకు పారిపోవడం లేదా భారత్ లోని అజ్ఞాత ప్రాంతాల్లో తలదాచుకునే నేరస్థుల ఆటకట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని కోసం 'భారత్‌పోల్' అనే పోర్టల్‌ను సీబీఐ తయారు చేసింది. దీన్ని ఈరోజు (జనవరి 7) కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రారంభించనున్నారు.