సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై షూతో దాడికి యత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోమవారం ఉదయం విచారణ జరుగుతున్న సమయంలో ఒక వృద్ధ న్యాయవాది రాకేష్ కిషోర్(71) షూ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో భద్రతా సిబ్బంది అడ్డుకుని బయటకు తీసుకుని పోయారు.