Today Business Headlines 06-04-23: ఆర్బీఐ అనూహ్య నిర్ణయం: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్‌బీఐ నిర్ణయాలు వెలువడ్డాయి. వడ్డీ రేట్లు మరోసారి పెంచకుండా పాత వాటినే కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిన నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇవాళ వెల్లడించారు. రెపో రేటును మార్చకుండా ఆరున్నర శాతంగానే అమలుచేస్తామని తెలిపారు.