అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్ అలీలను ఐబీ అధికారులు అరెస్టు చేశారు. ఇద్దరు ఉగ్రవాదుల నివాసాల్లో మంగళవారం జరిపిన సోదాల్లో భారీగా మందుగుండు సామగ్రి పట్టుబడింది. సిద్ధిక్ నివాసంలో 4 కిలోల ఆర్డీఎక్స్, డిటొనేటర్ వైర్లు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అలీ నివాసంలో పేలుళ్లకు ఉపయోగించే వైర్లను పోలిసులు గుర్తించారు. గురువారం రాత్రి మరోసారి టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్…