కొబ్బరి నీరే కాదు.. పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదయాన్నే పరగడుపున పచ్చి కొబ్బరి ముక్కను తినడం వల్ల సులభంగా బరువు తగ్గడంతోపాటు శరీరంలోని అనేక సమస్యలు నయమవుతాయి.
కొబ్బరి బొండం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. పచ్చి కొబ్బరితో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇది తియ్యగా రుచిగా ఉంటుంది. దీంతో ఎక్కువగా చట్నీలు, తీపి వంటకాలు చేస్తూంటారు. కొబ్బరిని చాలా తక్కువగా ఉపయోగిస్తారు.. పచ్చి కొబ్బరిని రోజూ తగిన మోతాదులో తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. పచ్చి కొబ్బరి యాంటీ బయోటిక్ గా పని చేస్తుంది. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంతో పాటు చర్మ, జుట్టు సమస్యలను…