(జూలై 11న రవికిశోర్ పుట్టినరోజు) బ్యానర్ పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నిర్మాతల్లో ‘స్రవంతి’ రవికిశోర్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. మూడున్నర దశాబ్దాలుగా చిత్రాలను నిర్మిస్తున్నారు రవికిశోర్. తన మనసుకు నచ్చిన కథను సినిమాగా తెరకెక్కించడంలోనూ, మెచ్చిన పరభాషా చిత్రాన్ని తెలుగులోకి అనువదించడంలోనూ రవికిశోర్ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. విలక్షణ దర్శకుడు వంశీతో రవికిశోర్ చిత్రప్రయాణం ఆరంభించారు. వంశీ దర్శకత్వంలో ‘లేడీస్ టైలర్’ నిర్మించి, ఆ సినిమాతోనే తన అభిరుచి ఏమిటో చాటుకున్నారు.…