వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతిచెందాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిన్న సాయంత్రం మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్‌ను వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. అయితే చికిత్సకు సహకరించక పోవడంతో శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతతో మృతిచెందినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అసలే ఆర్థిక…