ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి.. ఈ మోసాలు పలురకాలు.. కొంతమంది బ్యాంకు వివరాలను మాయమాటలు చెప్పి తెలుసుకొని కొట్టేస్తుంటే.. ఇంకొంతమంది మ్యాట్రిమోని పేరుతో డబ్బులు కొట్టేస్తున్నారు. మరికొంతమంది డబ్బుతో పాటు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఒక వ్యక్తి తనకు తాను ఆర్మీ ఆఫీసర్ అని చెప్పి నలుగురు యువతులను మోసం చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బెల్గాంకు కుంపాత్‌గిరి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ భౌరో పాటిల్(31) అనే వ్యక్తి మ్యాట్రిమోనీలో వధువు కావలెను…