అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానే నిర్దోషి అని తేలింది. సందీప్ లామిచానేపై దాఖలైన అత్యాచారం కేసులో పటాన్ హైకోర్టు తుది తీర్పును వెలువరిస్తూ.. అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత తీర్పును తోసిపుచ్చింది. కాగా.. అతను టీ20 ప్రపంచ కప్ 2024 కోసం నేపాల్ తరుఫున ఆడనున్నాడు. పటాన్ హైకోర్టు అధికార ప్రతినిధి తీర్థరాజ్ భట్టారాయ్ ప్రకారం.. సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ బెంచ్ నిర్ణయాన్ని తోసిపుచ్చింది.
2017లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఎల్‌బీ నగర్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.ఈ కేసులో నిందితుడు మహ్మద్ కాజా మొయినుద్దీన్ (19)కు పదేళ్ల శిక్ష జైలు శిక్ష మరియు రూ. 11,000 జరిమానా., బాధితురాలికి రూ.1,00,000 పరిహారం వెంటనే చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. Also read: Lucky Boy: కాస్త ఆలస్యమైనా పిల్లడు ఉండేవాడు కాదు.. వైరల్ వీడియో.. మే 2017లో సరూర్‌నగర్ లోని కర్మాన్‌ఘాట్ కు…
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ పాఠశాల అమానుషంగా వ్యవహరించింది. సామూహిక అత్యాచారానికి గురైన ఓ విద్యార్థినిని 12వ తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతించలేదు.
Bombay High Court: తనను వివాహం చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి, తన ప్రేమికుడిపై వేసిన పిటిషన్‌ని బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ కొట్టేసింది. ఈ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందుగా తామిద్దరం పెళ్లి చేసుకుంటామనే ఆలోచన మేరకే శృంగారంలో పాల్గొన్నామని, అయితే, తన తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చిందని సదరు యువకుడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
Pakistan: పాకిస్తాన్ పూర్తిగా ఇస్లామిక్ దేశం, అక్కడి చట్టాలు కూడా ఇస్లామిక్ చట్టాలక అనుగుణంగానే ఉంటాయి. మరోవైపు అక్కడ స్త్రీలకు, వారి హక్కులకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. ఇక పెళ్లి తర్వాత స్త్రీని అనేది కేవలం ఒక సొత్తుగానే భావిస్తుంటారు. కొట్టినా, తిట్టినా, తమకు ఇష్టం లేకుండా సెక్స్ చేసినా కూడా పాక్ చట్టాల్లో శిక్షలు విధించే సెక్షన్లు చాలా తక్కువ.
అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానేకు 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. లామిచానే.. నేపాల్ క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్ గా వ్యవహరించగా, ఐపీఎల్ రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. మీడియా కథనాల ప్రకారం.. అత్యాచారం కేసులో క్రికెటర్ సందీప్ లామిచానేకు నేపాల్ కోర్టు బుధవారం ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఏలూరులో వాలంటీర్ వ్యవహారం సంచలనంగా మారింది.. మహిళను లోబర్చుకొని వాలంటీర్ గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామానికి చెందిన ఓ మహిళను లోబర్చుకున్న గర్భవతిని చేశాడు వాలంటీర్ మండిగ సత్య గణేష్.. అయితే, విషయం బయటకొస్తుందని నెల క్రితమే ఆ వాలంటీర్‌ను విధుల నుంచి తొలగించారు.
ఓ బాలికను రేప్ చేసి జైలుకెళ్లిన కామాంధుడు.. జైలు శిక్ష అనుభవించి విడుదలై మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం సత్నా జిల్లాలో మరో మైనర్ బాలికను రేప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సాత్నాలోని కృష్ణా నగర్‌కు చెందిన రాకేష్ వర్మ (35)గా గుర్తించారు.
Orissa High Court: సహజీవనంపై ఒరిస్సా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కలిసి ఉండీ సెక్స్ చేసుకుని వివాహం చేసుకుంటాననే వాగ్దానాన్ని ఉల్లంఘిస్తే దాన్ని అత్యాచారంగా పరిగణించలేం అని ఒడిశా హైకోర్టు వ్యాక్యానించింది. భువనేశ్వర్ కు చెందిన ఓ వ్యక్తి ఎదుర్కొంటున్న అత్యాచారం ఆరోపణల్ని కోర్టు కొట్టేసింది.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక గ్రామంలో 16 ఏళ్ల క్రితం 11 మంది గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 21 మంది పోలీసులను ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలో ఇద్దరు దర్యాప్తు అధికారులు విఫలమైనందున నిందితులను ప్రాథమికంగా నిర్దోషులుగా విడుదల చేసినట్లు కోర్టు పేర్కొంది.